ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు అసోంను వరదలు కోలుకోనీయకుండా చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. పలు గ్రామాలు నీట మునగడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. అయితే తాజాగా ఈ విపత్తు బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్. భారీ మొత్తంలో విరాళాన్ని అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ప్రియాంక.
-
#Assamfloods#PrayForAssam #AssamNeedsHelp
— PRIYANKA (@priyankachopra) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
You can make a donation here:
Rapid Response:https://t.co/4XD4N0vh1f
Action Aid: https://t.co/nV858gOGv9 pic.twitter.com/Sn1CoyllYc
">#Assamfloods#PrayForAssam #AssamNeedsHelp
— PRIYANKA (@priyankachopra) July 26, 2020
You can make a donation here:
Rapid Response:https://t.co/4XD4N0vh1f
Action Aid: https://t.co/nV858gOGv9 pic.twitter.com/Sn1CoyllYc#Assamfloods#PrayForAssam #AssamNeedsHelp
— PRIYANKA (@priyankachopra) July 26, 2020
You can make a donation here:
Rapid Response:https://t.co/4XD4N0vh1f
Action Aid: https://t.co/nV858gOGv9 pic.twitter.com/Sn1CoyllYc
"అసోం పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. వరదల వల్ల లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రాణ, ఆస్తినష్టం ఊహకు కూడా అందనిది. వరద పోటెత్తడం వల్ల కజిరంగ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా మునిగిపోయింది. ఇలాంటి సమయంలో వారికి మన మద్దతు అవసరం. అసోంలో పనిచేస్తోన్న కొన్ని సంస్థలకు మేము విరాళాలు అందించాం. వారు అవసరమైన వారికి సాయం చేస్తారు.
-ప్రియాంక, కథానాయకురాలు.
ఇటీవల కరోనా బాధితుల కోసం ప్రధానమంత్రి సహాయనిధి(పీఎం రిలీఫ్ ఫండ్)కు విరాళాలు అందించారు నిక్-ప్రియాంక దంపతులు. ఆపత్కాలంలో ప్రియాంక దంపతులు చూపించే దాతృత్వం అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అసోంలో బ్రహ్మపుత్ర నదికి వరద పోటెత్తడం వల్ల.. చుట్టుపక్కల 2,543 గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.22 లక్షల హెక్టార్ల పంట నీట మునిగింది.