Radheshyam Update: రాధేశ్యామ్ సినిమా విడుదలైంది. సినిమా రివ్యూ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి Radheshyam review: ప్రేమకు, విధికి మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?
Prabhas radheshyam movie: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 'రాధేశ్యామ్' హడావుడి కనిపిస్తోంది. పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ చిత్రం మార్చి 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ లవర్‌బాయ్‌గా కనిపించడం, సినిమా కథాంశం, విజువల్ ఎఫెక్ట్స్‌తో టీజర్, ట్రైలర్ ఉత్కంఠంగా ఉండటం సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. అంతేకాక.. ఈ సినిమా ప్రచార చిత్రంలో ప్రభాస్ (విక్రమాదిత్య), పూజా హెగ్డే (ప్రేరణ) మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే..మంచి ప్రేమ కావ్యం అయ్యేటట్టు ఉంది. ఈ నేపథ్యంలో డార్లింగ్.. గతంలో లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డార్లింగ్
తన కెరీర్లో అప్పటి వరకు మాస్ కథా చిత్రాల్లో అలరించిన ప్రభాస్ 'డార్లింగ్'తో క్లాస్ అండ్ లవర్‌బాయ్ హీరోగా మారిపోయారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ క్లాసీలుక్, నటన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేసింది. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ప్రభాస్ సూపర్‌గా నచ్చేశారు. ఈ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో ప్రభాస్ చేసిన కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిస్టర్ పెర్ఫెక్ట్
మళ్లీ కాజల్ అగర్వాల్‌తో కలిసి దశరథ్ దర్శకత్వంలో 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో నటించారు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కన్నా పెద్ద హిట్‌ను అందుకుంది. "కెరీర్లో గెలవాలంటే రాజీపడకుండా కష్టపడాలి. అప్పుడే గెలుస్తాం. కానీ బంధాల్లో కొన్నిసార్లు రాజీపడితేనే గెలుస్తాం" అని ప్రభాస్ చెప్పిన డైలాగ్‌లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో టాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. 2011లో విడుదలైన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిర్చి
మిస్టర్ పెర్ఫెక్ట్ వంటి కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవుతున్న ప్రభాస్‌కు మాస్ హిట్ ఇస్తానంటూ దర్శకుడు కొరటాల శివ డార్లింగ్ చేతికి కత్తి ఇచ్చారు. 2013లో విడుదలైన ఈ సినిమాలో ప్రభాస్ మాత్రం తనదైన శైలిలో మంచి ఎనర్జీతో సూపర్‌గా నటించారు. ఇందులో ప్రభాస్ లుక్, నటన, అనుష్కతో కెమిస్ట్రీ అటు మాస్ అభిమానులకు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చింది. సినిమా కూడా అంతే రీతిలో హిట్ అయింది. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేది ఏముందని ప్రభాస్ డైలాగ్ చెబుతుంటే ధియేటర్లు దద్దిరిల్లాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వర్షం
'ఈశ్వర్' సినిమాతో వెండితెరలోకి అరంగ్రేటం చేసిన ప్రభాస్ మొదటి చిత్రంతోనే విజయం అందుకున్నారు. రెండో చిత్రం రాఘవేంద్ర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్‌కు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టింది. కెరీర్‌ను మలుపు తిప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విధా? ప్రేమా?
వాయిదాలమీద వాయిదాలు పడి ఎట్టకేలకు మార్చి 11న రాధేశ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు .ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నారు. విధికి, ప్రేమకు మధ్య జరిగే పోరు అనేది ఈ సినిమాలో ముఖ్య అంశం. ఇక విధి గెలుస్తుందా, ప్రేమ నెగ్గుతుందా తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందే. కాగా, ఈ చిత్రంతో లవర్‌బాయ్‌గా ప్రభాస్ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తారా లేదో చూడాలి..
ఇదీ చదవండి: Radheshyam: 'ప్రభాస్ నన్ను చాలా ప్రోత్సహించారు'