ETV Bharat / sitara

ప్రభాస్​ 'రాధేశ్యామ్'..​ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే? - ప్రభాస్​ రాధేశ్యామ్​ కలెక్షన్స్​

RadheShyam Day 1Collections: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్​ 'రాధేశ్యామ్​' అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సినీవిశ్లేషకులు అందించిన వసూళ్ల వివరాలను తెలుసుకుందాం..

Radheshyam Day 1 collectiions
ప్రభాస్​ రాధేశ్యామ్ కలెక్షన్లు
author img

By

Published : Mar 12, 2022, 7:43 AM IST

Updated : Mar 12, 2022, 8:56 AM IST

RadheShyam Day 1Collections: ప్రభాస్​-పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' శుక్రవారం విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్స్​లో రిలీజ్​ అయింది. కలెక్షన్ల పరంగా తొలి రోజు మంచి వసూళ్లను అందుకుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. ఓ సారి ఆ వివరాలపై లుక్కేద్దాం..

దేశవ్యాప్తంగా రూ.48 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా సాధించినట్లు సమాచారం. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు అందుకున్నట్లు సినీవర్గాల టాక్. హిందీలో కలెక్షన్లపై స్పష్టత లేదు. ఓవర్సీస్​లోనోనూ బాగానే వచ్చాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్​ఏలో ప్రీమియర్​, తొలి రోజు కలెక్షన్లు కలిపి 1.4 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది!

రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్‌. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

ఇదీ చూడండి: ప్రభాస్​ నన్ను ముద్దు పెట్టుకున్నారు: తమన్​

Last Updated : Mar 12, 2022, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.