ETV Bharat / sitara

ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె' అప్డేట్​.. మిల్కీ బ్యూటీ ట్రీట్​ మామూలుగా లేదుగా! - కృతి శెట్టి

Prabhas Project K Update: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న 'పాజెక్ట్​ కె', వరుణ్ తేజ్ 'గని', 'కశ్మీర్​ ఫైల్స్​' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

prabhas project k update
amitabh bachchan prabhas
author img

By

Published : Mar 24, 2022, 1:19 PM IST

Prabhas Project K Update: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'ప్రాజెక్ట్​ కె'. నాగ్​ అశ్విన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్​ అగ్రకథానాయిక దీపికా పదుకొణె హీరోయిన్. అమితాబ్​ బచ్చన్​ కీలక పాత్రలో నటిస్తున్నారు. బిగ్​బీ పాత్రకు సంబంధించి ఇటీవలే ఓ ఆసక్తికర అంశం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆయన ప్రభాస్​ తండ్రిగా, సంపన్న వ్యాపారవేత్తగా నటించనున్నారట.

prabhas project k update
అమితాబ్ బచ్చన్

'ప్రాజెక్ట్​ కె'లో ప్రభాస్..​ సూపర్​హీరో పాత్రలో నటించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్​తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

మరోసారి అదరగొట్టిన మిల్కీ బ్యూటీ..

ఇప్పటికే పలు చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో కనిపించి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తమన్నా 'గని'తో మరోసారి సందడి చేసింది. వరుణ్‌తేజ్‌ హీరోగా రూపొందిన 'గని'లో 'కొడితే' అనే స్పెషల్‌ సాంగ్‌లో నర్తించింది. ఇటీవల విడుదలైన లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభించగా చిత్ర బృందం గురువారం పూర్తి వీడియోను విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాటలో ఎప్పటిలానే తమన్నా డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 'గని'కి తమన్‌ స్వరాలందించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్‌ నటించింది. జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర, సునీల్‌శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది.

నితిన్​కు ఉత్తర్వులు..

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో నితిన్.. గుంటూరు​​ జిల్లా కలెక్టర్​గా నటించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మేరకు నితిన్​కు ఉత్వర్తులు జారీ అయ్యాయంటూ గురువారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది.

ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

krithi shetty
కృతి శెట్టి

రూ.200 కోట్ల 'కశ్మీర్​ ఫైల్స్​'

చిన్న చిత్రంగా మొదలై.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది కశ్మీర్​ ఫైల్స్​. వివేక్ రంజన్​ అగ్రిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అమితంగా ఆదరిస్తున్నారు. దీంతో బుధవారం నాటికి రూ.228.85 కోట్ల (గ్రాస్​) వసూళ్లను అధిగమించింది.

kashmir files collection
'కశ్మీర్​ ఫైల్స్​'

90వ దశకంలో కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన దారుణ మారణకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

పునీత్ ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​..

దివంగత కన్నడ పవర్​స్టార్​ పునీత్​రాజ్​కుమార్​ చివరి చిత్రం 'జేమ్స్​'.. థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 17న విడుదలైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్​ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించింది.

puneeth rajkumar james movie
'జేమ్స్'

అయితే ఫ్యాన్స్​ను నిరాశ పరిచే ఓ కథనం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. త్వరలోనే 'జేమ్స్​' ఓటీటీలోకి రానుందట. ప్రమఖ ఓటీటీ సోనీ లివ్​లో ఏప్రిల్​ 15 నుంచి స్ట్రీమింగ్​ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకట రావాల్సి ఉంది. ఇప్పటికే కశ్మీర్​ ఫైల్స్​ విడుదలతో 'జేమ్స్'​కు థియేటర్లు తగ్గిపోయాయనే ఆరోపణలు, 'ఆర్​ఆర్​ఆర్'​ రిలీజ్​తో ఆ సంఖ్య మరింత పడిపోతుందనే భయం కన్నడ అభిమానుల్లో నెలకొంది! ఈ క్రమంలోనే ఓటీటీ వార్త వారికి మరింత నిరాశ కలిగించేదే!

ఇదీ చూడండి: 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్.. ప్రీమియర్స్​లో 'ఆర్​ఆర్​ఆర్' కలెక్షన్ల సునామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.