ETV Bharat / sitara

'ఆదిపురుష్' కోసం​ ప్రభాస్​ డైట్​ ఏంటంటే?

author img

By

Published : May 22, 2021, 11:34 AM IST

'ఆదిపురుష్​'లో ప్రభాస్​(రాముడు), తన(లక్ష్మణుడు) పాత్రల కోసం ఎలాంటి డైట్​ పాటిస్తున్నారో తెలిపాడు నటుడు సన్నీ సింగ్​. పాత్రలకు తగ్గట్లు శరీరాకృతిని మార్చుకునేందుకు ఎలాంటి స్టెరాయిడ్స్​ తీసుకోవట్లేదని చెప్పాడు.

adipurush
ఆదిపురుష్​

రెబల్​స్టార్ ప్రభాస్​ హీరో ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్​'. ఈ చిత్రంలో ప్రభాస్​ రాముడిగా, నటుడు సన్నీ సింగ్​ లక్ష్మణుడిగా​ కనిపించనున్నారు. కొద్ది నెలలుగా ఆ పాత్రలకు తగ్గట్లు శరీరాకృతిని మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ.. పాత్రలకు తగ్గట్లు బాడీ కోసం డార్లింగ్​, తాను ఎలాంటి డైట్​ పాటిస్తున్నారో తెలిపాడు.

"కండలు తిరిగిన దేహాన్ని తయారుచేసేందుకు ఎలాంటి స్టెరాయిడ్స్​ వాడటం లేదు. తినే పదార్థాలలో 50 శాతం కార్బోహైడ్రేట్స్​, 50 శాతం ప్రొటీన్స్​ ఉండేలా కచ్చితమైన డైట్​ పాటిస్తున్నాం. కండరాలు బలంగా అవ్వడానికి వే ప్రొటీన్​ తీసుకుంటున్నాం" అని వివరించాడు.

ప్రస్తుతం కరోనా వల్ల 'ఆదిపురుష్'​ చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇందులో సీతగా కృతిసనన్​, రావణుడిగా సైఫ్​ అలీఖాన్​ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్ మాట వినుంటే 'ఆదిపురుష్'​కు నష్టం తప్పేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.