Prabhas amitabh movie: డార్లింగ్ ప్రభాస్ కల నిజమైంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో తొలిషాట్ పూర్తి చేసిన ఆనందాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రస్తుతం 'ప్రాజెక్టు k' షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే వీరిద్దరిపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ 'రాధేశ్యామ్' రిలీజ్‌కు రెడీగా ఉంది. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత 'స్పిరిట్' సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్.
ఇవీ చదవండి: