ETV Bharat / sitara

సోల్​మేట్​ను పరిచయం చేసిన 'పరుగు' నటి

author img

By

Published : Oct 29, 2020, 9:03 AM IST

Updated : Oct 29, 2020, 12:14 PM IST

పరుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటీమణి పూనమ్ బజ్వా ఫాలోవర్స్​ను సర్​ప్రైజ్​ చేశారు. తనకు కాబోయే భర్త ఇతడే అని ఓ వ్యక్తిని పరిచయం చేశారు. ప్రియుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేరు చేశారు.

poonam bhajwa_Soulmate
సోల్​మేట్​ని పరిచయం చేసిన 'పరుగు' నటి

నటి పూనమ్ బజ్వా తన ప్రియుడు, సోల్‌మేట్‌ సునీల్‌ రెడ్డిని పరిచయం చేశారు. 'మొదటి సినిమా' (2005)తో కెరీర్‌ ఆరంభించి.. 'బాస్‌', 'పరుగు' తదితర చిత్రాలతో తెలుగులో గుర్తింపు పొందిన ఆమె బుధవారం ఫాలోవర్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడిస్తూ.. ప్రియుడికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు.

poonam bhajwa_Soulmate
పూనమ్, సునీల్ రెడ్డి

అభినందనలు తెలిపిన సినీ ప్రముఖులు

'సునీల్‌ రెడ్డి.. మై రూట్స్‌, గ్రౌండ్‌, వింగ్స్‌. హ్యాండ్సమ్‌, అందమైన హృదయం ఉన్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌ మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. నీతో కలిసి ఉండే ప్రతి మూమెంట్‌ ఓ మ్యాజిక్‌లా ఉంటుంది. నీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ప్రేమ, ఫన్‌ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మాటల్లో వర్ణించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అని పూనమ్‌ ఆయనపై ఇష్టాన్ని తన స్టైల్‌లో చెప్పారు. ఆమె పోస్ట్‌కు ఫాలోవర్స్‌తోపాటు సినీ ప్రముఖులు సందీప్‌ కిషన్‌, కామ్నా జఠ్మలానీ, ఆర్తి చబ్రియా తదితరులు స్పందించారు. నటికి శుభాకాంక్షలు చెప్పారు.

poonam bhajwa_Soulmate
సోల్​మేట్​తో పూనమ్ బజ్వా

మాలీవుడ్, కోలీవుడ్​​లో ఎక్కువగా..

పూనమ్‌ టాలీవుడ్‌ కంటే మాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎక్కువ చిత్రాల్లో నటించారు. గత ఏడాది నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తీసిన 'యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు'లో అతిథిగా మెరిశారు. ఆపై 'కుప్పతు రాజా' అనే తమిళ సినిమాలో సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఇందులో కథానాయకుడిగా నటించారు.

ఇదీ చదవండి:సంక్రాంతికే సినిమా సందడి.. ఇప్పటికే బరిలో నాలుగు

Last Updated : Oct 29, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.