Pooja Hegde: నటి పూజా హెగ్డే తన తదుపరి చిత్రం 'రాధేశ్యామ్' ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తెలుగు ఇండస్ట్రీలో తన అనుభవాలను గురించి మాట్లాడారు. తనతో నటించిన హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లో మంచి లక్షణాలను పూజా వెల్లడించారు.
"రాధేశ్యామ్ చిత్రంలో ప్రేరణ అనే పాత్ర చేశాను. ఈ పాత్రలో అనేక కోణాలు, భావోగ్వేదాలు ఉన్నాయి. దీని కోసం చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఇది నా అలోచనలపైనా ప్రభావం చూపింది. నేను జాతకాలను, జ్యోతిష్యాలను నమ్ముతాను."
ప్రభాస్ నిరాడంబరులు..
"ప్రభాస్‌కి అనేక మంది అభిమానులు ఉన్నా చాలా నిరాడంబరంగా ఉంటారు. 'రాధేశ్యామ్' చిత్ర షూటింగ్ సమయంలో మా టీమ్‌లో చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రభాస్ వారందరికీ ఆహారం పంపించారు. దీని పట్ల మా అమ్మ కూడా సంతోషం వ్యక్తం చేసింది."
జూనియర్ ఎన్టీఆర్ ఓ పర్ఫెక్షనిస్ట్
"జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. పర్ఫెక్షనిస్ట్. ఆయన తన షాట్స్‌ని సింగిల్ టేక్‌లోనే పూర్తి చేస్తారు. అల్లు అర్జున్ సెట్స్‌లో ఎంతో ఉత్సాహభరింతగా ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుతో ఒక చిత్రం చేస్తున్నా. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను వాటి గురించి త్వరలో వెల్లడిస్తాను."
పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 150 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. రాధాకృష్ణకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇదీ చదవండి: రిలీజ్ డేట్‌తో నాగశౌర్య.. మరో క్రికెటర్ బయోపిక్