ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాలో బుట్టబొమ్మగా అలరించింది పూజా హెగ్డే. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసిందని సమాచారం. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించే చిత్రంలో ఈమెను హీరోయిన్గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ విషయమై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
ఈ ప్రాజెక్టు కన్నా ముందు పవర్‌స్టార్.. 'పింక్' రీమేక్‌లో నటించనున్నాడు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాత. చిత్రీకరణ తొందరగా ముగించి, వేసవికి థియేటర్లలోకి తేవాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇవీ చదవండి: