ETV Bharat / sitara

దసరాకు 'పెళ్లి సందD'.. శర్వానంద్ కొత్త సినిమా - enemy movie release

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పెళ్లిసందD ట్రైలర్, రిలీజ్ డేట్, ఎనిమీ, శర్వానంద్ కొత్త సినిమా కబుర్లు ఉన్నాయి.

pelli sandadi
పెళ్లి సందD
author img

By

Published : Sep 22, 2021, 9:29 AM IST

శర్వానంద్‌ మరో కొత్త సినిమాకు(Sharwanand New Movie) పచ్చజెండా ఊపారా? దసరాకు ఆ కొత్త కబురు వినిపించనున్నారా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. శర్వా ప్రస్తుతం 'మహా సముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'ఒకే ఒక జీవితం' చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో 'మహా సముద్రం' ఈ దసరా సందర్భంగా అక్టోబరు 14న(Maha Samudram Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ పండగ సందర్భంగానే శర్వా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. వక్కంతం వంశీ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కోసం పలువురు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. దసరాకు చిత్రాన్ని ప్రకటించి.. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దసరాకు సందడి..

'పెళ్లి సందD' ట్రైలర్​(pelli sandadi new movie)​.. సెప్టెంబరు 22(బుధవారం) ఉదయం 11గంటలకు రానుంది. సూపర్​స్టార్​ మహేశ్​బాబు రిలీజ్ చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు(pelli sandadi 2021 trailer).. ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరీ రోనంకి దర్శకురాలు. అయితే ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డబ్బింగ్ షురూ..

తమిళ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం 'ఎనిమీ'(vishal enemy song). ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు విశాల్.. సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో విడుదల చేశారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇదీ జరిగింది: గోవాలో 'అఖండ' ఆటాపాట.. దసరాకు రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.