ETV Bharat / sitara

'పెళ్లి సంద..డి' సాంగ్​ అప్​డేట్​.. 'ఏక్​ మినీ కథ' ట్రైలర్​ - అనుకోని అతిధి టీజర్​

కొత్త సినిమా కబుర్లు​ వచ్చేశాయి. 'పెళ్లి సంద..డి' చిత్రంలోని 'బుజ్జులు బుజ్జులు' సాంగ్​ అప్​డేట్​, 'ఏక్​ మినీ కథ' ఓటీటీ ట్రైలర్​తో పాటు ప్లేబ్యాక్​ ఓటీటీ రిలీజ్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

pelli sandadi 2021 bujjulu bujjulu song
'పెళ్లి సంద..డి' సాంగ్​ అప్​డేట్​.. 'ఏక్​ మినీ కథ' ట్రైలర్​
author img

By

Published : May 21, 2021, 4:27 PM IST

Updated : May 21, 2021, 4:42 PM IST

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లి సంద..డి'. ఇందులోని 'బుజ్జులు బుజ్జులు' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆదివారం(మే 23) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

pelli sandadi 2021 bujjulu bujjulu song
'పెళ్లి సంద..డి' సాంగ్​ అప్​డేట్

కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడిన 'ఏక్​ మినీ కథ' చిత్రం ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. ఈ నెల 27న అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను శుక్రవారం రిలీజ్​ చేశారు. సంతోశ్​ శోభన్​, కావ్య థాపర్​ హీరోహీరోయిన్లుగా నటించగా.. శ్రద్ధాదాస్​, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్​, పోసాని కృష్ణమురళి కీలకపాత్రలు పోషించారు. కార్తిక్​ రాపోలు దర్శకత్వంలో మేర్లపాక గాంధీ నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సైకలాజికల్ థ్రిల్లర్​ కథాంశంతో మలయాళంలో విడుదలై సూపర్​హిట్​ అయిన చిత్రం 'అథిరన్' తెలుగు డబ్బింగ్​ ఓటీటీలో విడుదల కానుంది. ఆహాలో 'అనుకోని అతిథి' పేరుతో మే 28నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ చిత్ర టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఫహాద్‌ ఫాజిల్‌, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్‌ దర్శకత్వం వహించాడు. కేరళలో 1970లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మలయాళంలో 2019 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

రెండు కాలాల మధ్య ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో రూపొందిన చిత్రం 'ప్లేబ్యాక్​'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దినేష్ తేజ, అనన్య నాగళ్ల జంటగా నటించారు. ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.

pelli sandadi 2021 bujjulu bujjulu song
ప్లేబ్యాక్​ ఓటీటీ రిలీజ్​

ఇదీ చూడండి.. రోడ్లపై జాన్వీ కపూర్​ సైక్లింగ్​.. వీడియో వైరల్​!

Last Updated : May 21, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.