ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఇవన్నీ సాధారణమైన ప్రశ్నలే. కానీ వీటికి అసాధారణమైన సమాధానాలు వచ్చాయి. అదెలాగో తెలియాలంటే '5 డబ్ల్యూస్' చూడాల్సిందే అంటున్నారు ప్రణదీప్ ఠాకోర్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్ర పోషించారు. యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "పరిశోధనాత్మక కోణంలో సాగే మిస్టరీ డ్రామా ఇది. పాయల్ రాజ్‌పూత్‌ను సరికొత్త కోణంలో చూపిస్తున్నాం. ఒక పోలీస్ అధికారి జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తితో అల్లిన కథ ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి" అన్నారు. ఈ చిత్రానికి అనిల్ బండారి సినిమాటోగ్రఫీ చేయగా.. మహతి సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి: బాహాబాహీ తలపడుతున్న బావ-బావమరిది!