నాగార్జున కథానాయకుడిగా, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులోని ఓ ప్రత్యేక గీతం కోసం 'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది పాయల్. తాను ఎలాంటి ఐటమ్ సాంగ్ చేయట్లదేని స్పష్టం చేసింది.
-
Posting just to make clear I’m not going to be part of any song .
— paayal rajput (@starlingpayal) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0
">Posting just to make clear I’m not going to be part of any song .
— paayal rajput (@starlingpayal) May 24, 2021
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0Posting just to make clear I’m not going to be part of any song .
— paayal rajput (@starlingpayal) May 24, 2021
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0
2016లో విడుదలై ఘనవిజయం సాధించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. మొదటి చిత్రంలో నటించిన రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా ఇందులో కనిపించనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.
కాగా, అందాల సుందరి పాయల్ తెలుగులో వెంకటేశ్‌తో కలిసి 'వెంకీమామ', రవితేజ సరసన 'డిస్కోరాజా' చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి 'ఏంజెల్' అనే చిత్రంలో చేస్తోంది.