ETV Bharat / sitara

వాడి చావు నా చేతుల్లోనే ఉంది: పాయల్​ - పాయల్​ రాజపుత్​ ట్రైలర్​

చైతన్య కృష్ణ, పాయల్ రాజ్​పుత్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అనగనగా ఓ అతిథి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​​ విడుదల చేశారు ప్రముఖ హీరో వెంకటేశ్​. విభిన్న పాత్రలో కనిపించిన పాయల్ తన నటనతో మెప్పించింది.

payal
పాయల్​
author img

By

Published : Nov 17, 2020, 10:40 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌, చైతన్య కృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం 'అనగనగా ఓ అతిథి'. దయాల్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోందీ ప్రచార చిత్రం.

  • ]" class="align-text-top noRightClick twitterSection" data="]">]

ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రల్లో దర్శనమిచ్చిన పాయల్‌ ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించిందనిపిస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 'ఒకరు బతకాలంటే ఇంకొకరు చావాలి అదే సృష్టి' అనే ఆసక్తికర అంశంతో వస్తుందీ చిత్రం.

ప్రశాంతంగా ఉండే జీవితంలోకి వచ్చిన ఆ అతిథి ఎవరు? సైలెంట్‌గా ఉండే పాయల్‌ కిల్లర్‌గా ఎందుకు మారింది తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కన్నడలో రూపొందిన 'ఆ కరళ రాత్రి' అనే క్లాసిక్​ థ్రిల్లర్​ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ సినిమా. నవంబరు 20న ఆహా డిజిటల్‌ వేదికపై ఈ చిత్ర విడుదల కానుంది.

ఇదీ చూడండి :

ఇక్కడ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి: పాయల్

అమ్మే ఆ పాత్రలు చేయమంటోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.