'మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు' అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. 'ఉప్పెన' శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్‌తేజ్.. కొత్త సినిమా సెట్‌కు వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా 'ఉప్పెన' టీమ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రేమకథతో తీసిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుకు కూడా ఇదే తొలి చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
ఇది చదవండి: ఆ నమ్మకాన్ని చిరంజీవి రెట్టింపు చేశారు: వైష్ణవ్‌తేజ్