ETV Bharat / sitara

మహేశ్​బాబు దంపతులకు పవన్​ కల్యాణ్ సర్​ప్రైజ్ - pawan kalyan wife

Pawan kalyan News: సూపర్​స్టార్ మహేశ్​బాబు దంపతుల్ని పవన్​ కల్యాణ్ దంపతులు సర్​ప్రైజ్ చేశారు. క్రిస్మస్​ కానుకగా ఓ కస్టమైజ్డ్ బహుమతిని పంపించారు.

pawan kalyan mahesh babu
పవన్​ కల్యాణ్ మహేశ్​బాబు
author img

By

Published : Dec 24, 2021, 5:00 PM IST

Updated : Dec 24, 2021, 7:19 PM IST

Pawan kalyan mahesh babu: పవర్​స్టార్ పవన్​కల్యాణ్​.. సూపర్​స్టార్ మహేశ్​బాబు దంపతుల్ని సర్​ప్రైజ్​ చేశారు. క్రిస్మస్​ కానుకగా ఓ కస్టమైజ్​ గిఫ్ట్​తో పాటు గ్రీటింగ్​ కార్డును పవన్​ దంపతులు వారికి పంపారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్​స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. పవన్-అన్నా లెజెన్వాకు ధన్యవాదాలు తెలిపారు.

namratha mahesh babu
నమ్రతా శిరోద్కర్ ఇన్​స్టా పోస్ట్

క్రిస్మస్​ను సెలబ్రేట్​ చేసుకునేందుకు తన భార్య అన్నాతో కలిసి పవన్​ ఇటీవల రష్యా వెళ్లారు. ఈ పండగ పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి స్వదేశానికి రానున్నారు.

గతంలో పవన్ 'జల్సా' సినిమాకు మహేశ్​బాబు వాయిస్ ఓవర్ అందించారు. అయితే ఈ హీరోలిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవల కాలంలో మల్టీస్టారర్​ సినిమాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్​లో ఒకవేళ పవన్-మహేశ్​ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

పవన్​.. 'భీమ్లా నాయక్' సినిమా చేస్తున్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​తోపాటు రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. తమన్ సంగీతమందించగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ నిర్మాత.

bheemla nayak movie
భీమ్లా నాయక్ రిలీజ్ పోస్టర్

మరోవైపు మహేశ్​ 'సర్కారు వారి పాట' చివరి దశ షూటింగ్​లో ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాంకుల ఎగవేత కథాంశంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకుడు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.