ETV Bharat / sitara

దీపావళి రేసులో పవన్​-క్రిష్​ సినిమా..! - డైరెక్టర్​ క్రిష్​ సమాచారం

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. తన కెరీర్​లో ఎప్పుడూ లేనంత జోష్​తో సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. ఇప్పటికే 'వకీల్​ సాబ్​' వేసవిలో విడుదల కానుండగా.. క్రిష్​ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Pawan kalyan, krish movie plan to release for diwali
దీపావళి రేసులో పవన్​-క్రిష్​ సినిమా..!
author img

By

Published : Mar 7, 2020, 9:35 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ ఏడాది రెండు చిత్రాలతో సినీప్రియులకు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం 'వకీల్​​ సాబ్​' చిత్రంలో నటిస్తున్నాడీ హీరో. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. వేసవి కానుకగా మే 15న విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ, ఈ చిత్రం ఏప్రిల్​లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పవన్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలన్న ఆలోచనలో క్రిష్​ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబరు 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పవన్‌ - క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

అందుకే దీనికి తగ్గట్లుగానే చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాడట క్రిష్‌. ఇక ఇందులో పవన్‌కు జోడీగా కనిపించబోయే నాయికకు సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం 'విరూపాక్ష' అనే టైటిల్‌ పరిశీలిస్తోంది చిత్రబృందం.

ఇదీ చూడండి.. ప్రపంచకప్​ అందుకున్న రణ్​వీర్​సింగ్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.