ETV Bharat / sitara

గ్రీన్ ​ఇండియా ఛాలెంజ్ : ​మొక్కలు నాటిన మెగా బ్రదర్స్​ - chiranjeevi green india challenge

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, పవన్​ కల్యాణ్​ సహా దర్శకులు అనిల్​ రావిపుడి, బోయపాటి శ్రీను పాల్గొన్నారు.

pawan kalyan green india cha;llenge
మొక్కలు నాటిన మెగా బ్రదర్స్​
author img

By

Published : Jul 26, 2020, 3:40 PM IST

​మొక్కలు నాటిన మెగా బ్రదర్స్​

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. తాజాగా ఈ హరిత సవాల్​లో భాగంగా జూబ్లీహిల్స్​ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. దర్శకుడు అనిల్​ రావిపుడి, బోయపాటి శ్రీను సహా పలువులు సినీ పరిశ్రమకు చెందిన వారు భాగస్వాములయ్యారు. భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి వీరందరూ వివరించారు.

ఇప్పటికే పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో భాగం పంచుకుంటున్నారు. ఈ మేరకు భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు.

ఇది చూడండి : 'ప్రపంచంలోనే చిత్రపరిశ్రమ ఓ అందమైన మోసం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.