ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' సెన్సార్.. బోయపాటితో రామ్​ పాన్ ఇండియా సినిమా - Telugu indian idol thaman

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, రామ్-బోయపాటి మూవీ, సూర్య 'ఈటీ' చిత్రాల సంగతులతో పాటు 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షో ప్రోమో కూడా ఉంది.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 18, 2022, 7:37 PM IST

Bheemla nayak censor: పవన్​ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సెన్సార్ పూర్తయింది. యూబైఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. 2 గంటల 25 నిమిషాల నిడివితో సినిమా ప్రదర్శితం కానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

bheemla nayak censor
భీమ్లా నాయక్ సెన్సార్ రిపోర్ట్

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌'కు రీమేక్‌ ఈ సినిమా. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు. పవన్​తో పాటు రానా ప్రధాన పాత్రల్లో నటించారు. నిత్యమేనన్, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు.

Ram Boyapati movie: యువ హీరో రామ్​.. పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. 'అఖండ'తో బంపర్​ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను.. ఈ చిత్రానికి దర్శకుడు. శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ram boypati movie
రామ్-బోయపాటి మూవీ

ప్రస్తుతం రామ్.. లింగుస్వామి డైరెక్షన్​లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.

Suriya ET teaser: సూర్య హీరోగా నటిస్తున్న 'ఈటీ' టీజర్​ రిలీజైంది. ఈ సినిమా పూర్తి వాణిజ్య అంశాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య సరసన ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మించారు. ఇమ్మాన్ సంగీతమందించారు. మార్చి 10న ఈ సినిమా.. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Telugu indian idol: 'ఆహా' ఓటీటీ.. 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోకు జడ్జిలు ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తిక్​, హీరోయిన్ నిత్యామేనన్.. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నట్లు తెలిసిపోయింది. షో ప్రోమోను శుక్రవారం రిలీజ్ కూడా చేశారు. ఫిబ్రవరి 25 నుంచి ప్రతి శుక్రవారం-శనివారం రాత్రి 9గంటలకు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.