అభిర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో ఆదా శర్మ కథానాయికగా నటించిన కామెడీ డ్రామా వెబ్ సిరీస్ చిత్రం 'పతి పత్ని ఔర్ పంగ'. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజే విడుదలైంది. అనుశ్రీ అబీర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవీన్ కస్తూరియా, ఆదా శర్మలు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్ర కథేంటంటే చిన్న చిన్న పనులు చేస్తూ మధ్యవర్తిత్వం చేసే రోమన్‌చక్ (నవీన్ కస్తూరియా) ఎప్పుడు నిరాశగా జీవితం గడుపుతుంటాడు. తన జీవితం కొత్త పుంతలు తొక్కాలని కోరుకుంటాడు. కానీ శివానీ భట్నాకర్ (ఆదా శర్మ)ను వివాహం చేసుకోవడంతో జీవితం మారిపోతుంది.
ఆ తర్వాత రోమన్‌చక్ తను చేసుకున్నది ఓ అమ్మాయిని కాదని తెలుసుకుంటాడు. తదనంతరం తన జీవితంలో వచ్చిన మార్పులు తెలియాలంటే కచ్చితంగా చిత్రం చూడాల్సిందే. ఇంకా చిత్రంలో హిటెన్ తేజ్వాని, గురుప్రీత్ సైనీ, అల్కా అమిన్ తదితరులు నటించారు. ఈ వెబ్‌సిరీస్ చిత్రం డిసెంబర్ 11న ఎమ్‌ఎక్స్ ప్లేయర్లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:కంగన.. మాతో పెట్టుకోవద్దు: మికా సింగ్