ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయిక మారింది. తొలుత శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేసింది చిత్రయూనిట్. బిజీ షెడ్యూల్ వల్ల శ్రద్ధా తప్పుకుంది. ఆమె స్థానంలో పరిణీతి చోప్రాను హీరోయిన్గా తీసుకున్నట్లు ప్రకటించారు.
"2020లో సైనా బయోపిక్‌ను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే శ్రద్ధాను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నాం. పరిణీతి సినిమాను ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. దేశం గర్వపడే క్రీడాకారుల్లో సైనా ఒకరు. ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం".
-భూషన్ కుమార్, టీ సిరీస్ అధినేత
సైనా బయోపిక్‌లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్రీడా నేపథ్యం గల సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ప్రపంచ పటంలో భారత్‌ను నిలిపిన సైనా పాత్ర కోసం బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకునేందుకుకావాల్సినంత శ్రమిస్తా".
-పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి
ఇప్పటికే టాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సాహో'లో నటిస్తున్న శ్రద్ధా.. బాలీవుడ్లో స్టాన్లీ కా డబ్బా, హవా హవాయి సినిమాల్లోనటించడానికి ఒప్పుకుంది.