Ram charan Rajamoui: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తను నటించడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి అని కథా'నాయకుడు రామ్‌చరణ్ చెప్పారు. బిగ్స్క్రీన్పై ఇద్దరు హీరోలు కలిసినటించిన సినిమాలు మెల్లగా అంతరించిపోతున్న సమయంలో తమ చిత్రం వస్తుందని అన్నారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్'లో హీరోలుగా నటించారు. వచ్చే జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చరణ్ వెల్లడించారు.
![Ram Charan rajamouli NTR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14015490_ram-charan-rajamouli-ntr.jpg)
"ఈ సినిమా నేను ఎస్ చెప్పడానికి ప్రధాన కారణం డైరెక్టర్ రాజమౌళి. ఈ స్టోరీ విని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇద్దరు స్టార్స్ ఓ సినిమాలో నటించడమే సాధ్యమే. గతంలో బాలీవుడ్, దక్షిణాదిలో చాలా సినిమాలు చూశాం. కానీ కారణాలేంటో తెలియవు గానీ కొంతకాలానికి అవి ఆగిపోయాయి. బహుశా బడ్జెట్ సమస్యలేమో! అయితే రాజమౌళి సినిమాతో ఇప్పుడు అది సాధ్యమైంది" అని రామ్‌చరణ్ అన్నారు.
Ntr Ramcharan: 2007లో 'చిరుత'తో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఎన్టీఆర్ వచ్చిన ఆరేళ్ల తర్వాత హీరోగా పరిచయమయ్యారు. ఇన్నేళ్ల కాలంలో వీరిద్దరూ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం సహా విశేషా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.
![RRR movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14015490_rrr-movie.jpg)
దర్శకుడు రాజమౌళితో చరణ్ 'మగధీర' లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకోగా.. ఎన్టీఆర్.. 'స్టూడెంట్ నం.1', 'సింహాద్రి', 'యమదొంగ' లాంటి బ్లాస్బస్టర్లు సొంతం చేసుకున్నారు.
"భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో దానిని నిరూపించారు. అలాంటి డైరెక్టర్‌తో పనిచేయడం వల్ల నా పని సులభమైంది. అలానే నా 13 ఏళ్ల కెరీర్ కంటే ఈ సినిమాలో చాలా పరిణతితో నటించాను. 'ఆర్ఆర్ఆర్'తో చాలా కొత్త విషయాలూ తెలుసుకున్నాను" అని చరణ్ చెప్పారు.
![ram charan alluri seetha ramaraju RRR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14015490_rrr-ram-charan.jpg)
RRR movie: ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్
- రాజమౌళికి చక్కిలిగింత పెట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్
- బిగ్‌బాస్‌లో 'ఆర్ఆర్ఆర్' బృందం.. ఎన్టీఆర్-చెర్రీలతో సల్మాన్ స్టెప్పులు
- RRR movie: రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు
- 'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్‌ఖాన్
- బాలయ్యతో సినిమా.. రాజమౌళి ఆన్సర్ ఇదే!
- RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సరికొత్త రికార్డు
- రాజమౌళి డైరెక్షన్‌ను డామినేట్ చేసిన ఓన్లీ హీరో అతడు!