ETV Bharat / sitara

ఆర్​ఆర్​ఆర్​: 'రామరాజు ఫర్​ భీమ్​' టీజర్​ వచ్చేసింది - ఆర్​ఆర్​ఆర్​ వార్తలు

తారక్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'రామరాజు ఫర్​ భీమ్​' టీజర్​ వచ్చేసింది. రామ్ చరణ్​ వాయిస్​ ఓవర్​తో వచ్చిన వీడియో అభిమానులను అలరిస్తోంది.

#RamarajuForBheem Teaser Released From RRR
ఆర్​ఆర్​ఆర్​: 'రామరాజు ఫర్​ భీమ్​' టీజర్​ వచ్చేసింది
author img

By

Published : Oct 22, 2020, 11:35 AM IST

Updated : Oct 22, 2020, 12:20 PM IST

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తమ అభిమాన కథానాయకుడు ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కోసం ఆశగా చూస్తున్న వారికి చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రను రామ్‌చరణ్‌ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు.. గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్‌’’ అంటూ తారక్‌ పాత్రను రామ్‌చరణ్‌ పరిచయం చేశారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ లుక్‌ అభిమానులను కట్టిపడేసింది. ఇక తెరపై ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం.

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభం కాగా, షూటింగ్‌ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గురువారం తాజా వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత చెప్పినా, అభిమానులను కాస్త ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు.

Last Updated : Oct 22, 2020, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.