ETV Bharat / sitara

'ఆ సినిమా చేయనందుకు చాలా బాధేసింది'

భాస్కర్​ దర్శకత్వంలో వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ కథ మొదట జూనియర్ ఎన్టీఆర్​ దగ్గరకు వచ్చిందట. కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోయాడు తారక్.

NTR was first cast in the movie Bommarillu.
ఎన్టీఆర్​
author img

By

Published : Aug 4, 2020, 6:04 PM IST

Updated : Aug 4, 2020, 6:12 PM IST

సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'బొమ్మరిల్లు'. 2006లో విడుదలైన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతంతో పాటు, నటీనటుల ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. అయితే తొలుత ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చింది. కానీ, ఓ కారణం వల్ల తాను ఈ సినిమా చేయలేకపోయానని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒకానొక సందర్భంలో వెల్లడించాడు.

"ఒకసారి దిల్‌రాజ్‌ వచ్చి 'బొమ్మరిల్లు' స్టోరీ చెప్పారు. స్క్రిప్ట్‌ బాగా నచ్చింది. అయితే, నాకున్న ఇమేజ్‌ కారణంగా ఆ సినిమా చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డా. అయ్యో మంచి స్క్రిప్ట్‌ పోతోందే అని ఎన్నోసార్లు ఆలోచించా. నా ఇమేజ్‌ ఆ సినిమాకు న్యాయం చేయలేదు. ఎన్టీఆర్‌ సినిమా అంటే డ్యాన్స్‌లు, ఫైట్‌లు, కామెడీ, హీరోయిజం, పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఉంటాయనుకొని నా అభిమానులు ఆశిస్తారు. అవేవీ లేకుండా సినిమా చేస్తే, నేను ఆ సినిమాకు మోసం చేసినవాడిని అవుతాను" అని చెప్పుకొచ్చాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే 'బృందావనం'లో బ్రహ్మానందం 'బొమ్మరిల్లు' ఫాదర్‌ క్యారెక్టర్‌ అని చెబుతూ ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించడానికి వస్తాడు. బ్రహ్మానందం అంటే భయపడిపోయే వ్యక్తిగా ఎన్టీఆర్‌ నవ్వులు పూయించాడు.

ప్రస్తుతం తారక్​ 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలో రామ్​చరణ్​తో కలిసి నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

Last Updated : Aug 4, 2020, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.