ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' నుంచి తారక్ పాత్ర పరిచయం ఎప్పుడంటే! - కొమురం భీమ్ లుక్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ హీరోలు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కొత్త అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం.

NTR character from RRR will release on this date
'ఆర్​ఆర్​ఆర్' మళ్లీ మొదలైంది.. తారక్ పాత్ర పరిచయానికి వేళైంది
author img

By

Published : Oct 6, 2020, 10:40 AM IST

Updated : Oct 6, 2020, 11:12 AM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్‌). కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. దాంతో పాటు కొంతకాలంగా ఈ సినిమా నుంచి అప్​డేట్లు కూడా ఏమీ రాలేదు. అయితే అభిమానుల నిరీక్షణను అర్థం చేసుకున్న చిత్రబృందం ఎట్టకేలకు ఓ అప్​డేట్ ఇచ్చింది.

కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్​ను మొదలుపెట్టినట్లు తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సెట్​ను శుభ్రం చేయడం, షూటింగ్‌లో ఉండే ప్రతి వస్తువును శానిటైజ్‌ చేస్తూ.. సిబ్బందికి థర్మల్‌ స్క్రీనింగ్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇక చివర్లో మరో అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో తారక్ పోషిస్తోన్న కొమురం భీమ్​ పాత్రను అక్టోబర్ 22న పరిచయం చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఎట్టకేలకు హ్యాపీ న్యూస్ అందించినట్లైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Oct 6, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.