ETV Bharat / sitara

అలాంటి సినిమా మళ్లీ చేయను: రష్మిక - రష్మిక ఇంటర్వ్యూ

నటి రష్మిక... అందం, అభినయం, చలాకీతనంతో సినీప్రియుల్ని ఇట్టే కట్టిపడేస్తోంది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​ బాబుతో కలిసి నటించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ప్రస్తుతం నితిన్​ సరసన 'భీష్మ'లో హీరోయిన్​గా చేసింది. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా రష్మిక విలేకర్లతో సరదాగా ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..

Nithin Reveals Interesting fact about Rashmika
నితిన్​ రహస్యం బయటపెడతా: రష్మిక
author img

By

Published : Feb 17, 2020, 5:43 AM IST

Updated : Mar 1, 2020, 2:11 PM IST

'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కొత్త ఏడాదిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది నటి రష్మిక. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'భీష్మ'. నితిన్ హీరో. వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మాత. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రష్మిక పలు విషయాలను పంచుకుంది.

Nithin Reveals Interesting fact about Rashmika
నితిన్​ రహస్యం బయటపెడతా: రష్మిక

నితిన్‌ సీక్రెట్‌ కనిపెడతా

దేనినైనా సరే తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో చాలా ఎక్కువ. అలా ఒకరోజు కుక్క బిస్కెట్స్‌ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఒక చిన్న ముక్క టేస్ట్ చేశా అంతే. అది నా సీక్రెట్‌. దానిని మొన్న నితిన్‌ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నా సీక్రెట్‌ బయటపెట్టాడు కాబట్టి నేను కూడా తనకు సంబంధించిన ఏదో ఒక సీక్రెట్‌ కనిపెట్టి బయటపెడతా. (నవ్వులు)

నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు

నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు 'అఆ' మూవీ చూశా. ఆ సినిమా బాగా నచ్చేసింది. ఒకవేళ సినీరంగంలోకి వెళ్తే తప్పకుండా ఇలాంటి మంచి సినిమా చేయాలనుకున్నా. 'భీష్మ' సినిమా షూటింగ్‌ మొదటిరోజు నితిన్‌ను చూసి ఎలా ఉంటారో? కలుస్తారో లేదో అని భయపడ్డా. కానీ ఆరోజు నితిన్‌, వెంకీ సరదాగా మాట్లాడుకోవడం చూసి.. ఓకే.. నేను కూడా సరదాగా ఉండొచ్చు అని ఫిక్స్‌ అయ్యా. నితిన్‌ చాలా సరదాగా ఉంటారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు నితిన్‌ తన లవ్‌ స్టోరీ గురించి చెప్పాడు.

వాలెంటైన్స్‌ డే.. చాలా బోర్‌

ఈ ఏడాది నా వాలెంటైన్స్‌డే చాలా బోర్‌గా గడిచింది. ఎందుకంటే ఆరోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లి బాగా వర్కౌట్లు చేశా. ఆరోజు నా షూటింగ్స్‌ అన్ని క్యాన్సిల్‌ అయ్యాయి. దాంతో ఇంటికి వెళ్లి ఒక ఇంగ్లీష్‌ రొమాంటిక్‌ సినిమా పెట్టుకొని చూశా. ఆ సినిమా 20 నిమిషాలు చూసేసరికి బాగా బోర్‌ కొట్టింది. అదే సమయంలో నాకు కథ చెప్పడానికి ఒక వ్యక్తి వస్తే ఆయన చెప్పిన కథ విన్నా. అలా ఆరోజు అంతా బోర్‌గా గడిచింది. ఇలాంటి బోరింగ్‌ వాలెంటైన్స్‌ డే ఎవరికీ ఉండి ఉండదు. ఆరోజు నైట్‌ డిన్నర్‌కి వెళ్లా.

ఆ సాంగ్‌ ఎంజాయ్‌ చేశా..

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన హీ ఇజ్ సో క్యూట్​.. హీ ఇజ్ సో స్వీట్​ పాటలోని స్టెప్పులను చాలా మంది టిక్‌టాక్‌ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ పాటను నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశా. ఇప్పుడు 'భీష్మ' సినిమాలో డ్యాన్స్‌ కోసం నేను ఎంతో కష్టపడ్డాను.

కథ ఎంపికలో అవి ముఖ్యం..

నేను ఏదైనా కథను ఎంపిక చేసుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటా. ఆ కథ నన్ను ఎంతలా సస్పెన్స్‌ చేస్తుంది అనేది చూస్తా. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్సుకతను ఆ కథ నాలో పెంచాలి. అలాగే ఆ కథ ప్రేక్షకుడిని ఎంతవరకూ మెప్పిస్తుంది అనేది ఆలోచిస్తా. 'భీష్మ' సినిమా ప్రేక్షకుడిని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వి నవ్వి చచ్చిపోతారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు కూడా నేను బాగా నవ్వుకున్నాను.

అలాంటి సినిమా మళ్లీ చేయను..

'‘సరిలేరు నీకెవ్వరు' సినిమా గురించి ట్రోల్స్‌ వచ్చాయని మీరు(విలేకర్లు) చెప్పేవరకూ నాకు తెలియదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో నా పాత్ర చాలా ఓవర్‌ యాక్టింగ్‌గా ఉంటుంది. డైరెక్టర్‌ చెప్పారు కాబట్టే అలా నటించా. ఆ పాత్ర డిమాండ్‌ చేయబట్టే అలా నటించాల్సి వచ్చింది. కెరీర్‌ ఆరంభంలో పాత్రల విషయంలో కొన్నిసార్లు ప్రయోగాలు చేయాలి. కానీ భవిష్యత్తులో అలాంటి సినిమా మళ్లీ చేయనని అనుకుంటున్నా.

డేట్స్‌ వల్లే..

మంచి కథ వస్తే బాలీవుడ్‌లో నటిస్తా. అయితే 'జెర్సీ' రీమేక్‌ ఆఫర్‌ వచ్చినప్పుడు.. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. డేట్స్‌ కుదరకపోవడం వల్లే నేను ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

బాలకృష్ణకు 'గీతగోవిందం' నచ్చింది

ఇటీవల నేను బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ సమయంలో నేను బాలకృష్ణ సర్‌తో మాట్లాడాను. ఆయన చాలా సరదాగా మాట్లాడారు. 'భీష్మ' సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆయన నేను నటించిన 'గీత గోవిందం' చూశానని చెప్పారు. ఆ సినిమా నచ్చిందని అన్నారు.

ఇదీ చదవండి: నితిన్​.. నిఖిల్​ల పెళ్లి ఒకే రోజు..!

Last Updated : Mar 1, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.