మెగా డాటర్ నిహారిక.. మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ ఈ కార్యక్రమానికి వేదిక. ప్రపంచంలోనే ది బెస్ట్ ప్యాలెస్ హోటల్స్‌లో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్‌విలాస్‌లో ఇటీవల ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఈశా సంగీత్ వేడుక జరిగింది. నిహారిక-చైతన్య పెళ్లి నేపథ్యంలో సదరు హోటల్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
గత కొన్నిరోజుల నుంచి నిహారిక పెళ్లి గురించే సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. మెగా హీరోలు అందరూ అక్కడే ఉండటం.. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తదితరుల ఫొటోలు వైరల్ అవుతుండటం వల్ల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పెళ్లి ఎన్నింటికి?
చైతన్య-నిహారికల వివాహ వేడుకకు బుధవారం(డిసెంబరు 9) రాత్రి 7:15 గంటలకు జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తంగా 120 మంది అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

చైతన్య ఎవరు?
నిహారికను పెళ్లి చేసుకోనున్న చైతన్య జొన్నలగడ్డ.. గుంటూరుకు చెందిన విశ్రాంతి ఐపీఎస్ అధికారి జె.ప్రభాకరరావు కుమారుడు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.
ప్రైవేట్ విమానాల్లో రాజస్థాన్‌కు
మూడు ప్రత్యేక విమానాల్లో పెళ్లివారు రాజస్థాన్ చేరుకున్నారు. నాగబాబు, ప్రభాకరరావు కుటుంబాలు ఓ విమానంలో వెళ్లగా, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మరో విమానంలో అక్కడికి చేరుకున్నారు. అల్లు ఫ్యామిలీ మరో ప్రైవేట్ జెట్‌లో ఉదయ్‌పుర్ వెళ్లారు.

సంగీత్‌లో అదరగొట్టిన మెగా ఫ్యామిలీ
సోమవారం రాత్రి జరిగిన సంగీత్‌లో మెగా ఫ్యామిలీ మొత్తం డ్యాన్స్‌లతో అదరగొట్టారు. కాబోయే వధూవరులు నిహారిక-చైతన్య.. 'బావగారూ బాగున్నారా' సినిమాలో పాటకు కాలు కదపగా, అల్లు అర్జున్-చిరంజీవి.. 'బంగారు కోడిపెట్ట' గీతానికి నృత్యం చేశారు. చిన్నపిల్లలు.. 'ఏక్ బార్ ఏక్ బార్' సాంగ్‌కు స్టెప్పులేశారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పవన్ రాకతో పెరిగిన క్రేజ్
ఉదయ్‌పుర్‌కు పెళ్లికి కొన్నిరోజుల ముందే మెగా ఫ్యామిలీ మొత్తం చేరుకోగా, పవన్ కల్యాణ్ మాత్రం ఒకరోజు ముందు అంటే మంగళవారం(డిసెంబరు 8).. అక్కడికి చేరుకున్నారు. ఆరోజు రాత్రి జరిగిన కార్యక్రమానికి హాజరై కాబోయే జంటను కలిశారు. వారితో ఫొటోలు కూడా తీసుకున్నారు. మెగాహీరోలందరితోనూ కలిసి తీసుకున్న ఫొటోను నాగబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.



