ETV Bharat / sitara

పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్ - పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పెళ్లి నేపథ్యంలో నిహారికను పెళ్లి కూతురు చేశారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

Niharika Haldi ceremony pics goes viral
పెళ్లి కూతురుగా నిహారిక.. ఫొటోలు వైరల్
author img

By

Published : Dec 5, 2020, 4:55 PM IST

మెగా వారసురాలు నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. శనివారం స్వగృహంలో ఈ శుభకార్యాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్నారట.

Niharika Haldi ceremony pics goes viral
పెళ్లి కూతురుగా నిహారిక

గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను నిహారిక మనువాడబోతోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి తంతు జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ శుభకార్యానికి వేదిక కాబోతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.