ETV Bharat / sitara

మహేశ్​-త్రివిక్రమ్​ చిత్రంలో హీరోయిన్​గా నిధి? - నిధి అగర్వాల్

'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటించనున్నారు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ను ఎంపికచేసినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Nidhhi Agerwal roped in for Mahesh Babu-Trivikram film?
మహేశ్​-త్రివిక్రమ్​ చిత్రంలో హీరోయిన్​గా నిధి?
author img

By

Published : May 10, 2021, 12:02 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్​ 'రా' ఏజెంట్​గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో మహేశ్​ సరసన యువ కథానాయిక నిధి అగర్వాల్​ను సంప్రదించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఇప్పుడు నెట్టింట్లో హాట్​ టాపిక్ నడుస్తోంది.

Nidhhi Agerwal roped in for Mahesh Babu-Trivikram film?
నిధి అగర్వాల్

మరోవైపు ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'పార్థు' అనగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు' చిత్రంలో మహేశ్​ పాత్ర పేరు. ఇప్పుడిదే పేరును కొత్త చిత్ర టైటిల్​గా పెట్టాలని త్రివిక్రమ్​ భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ప్రస్తుతం మహేశ్​​.. పరశురామ్​ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్​.. పవన్​ కల్యాణ్​ ప్రధానపాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి: బ్రహ్మ.. ఓ బ్రహ్మ.. మహముద్దుగా ఉందీ బొమ్మ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.