బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ మలైకా అరోరా జోడీ గురించి ఇప్పటికే చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయానికి బలం చేకూరుస్తూ ఓ ఇంటర్వ్యూలో క్రేజీ విషయాన్ని మలైకా వెల్లడించింది. ఓ నటుడితో క్వారంటైన్లో ఉన్నానని, అతడు తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉన్నాడని చెప్పింది. అభిమానులు మాత్రం ఆ నటుడు అర్జున్ అని చెబుతున్నారు.
"నేను ఓ నటుడితో క్వారంటైన్లో ఉన్నాను. చాలా సరదా వ్యక్తి. అతడితో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. నన్ను ఎప్పుడూ నవ్వించాలని ప్రయత్నిస్తాడు"
-- మలైకా అరోరా, బాలీవుడ్ హీరోయిన్
అయితే తమ బంధంపై ఈ జోడీ ఎలాంటి విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మాటల్లో చెప్పకపోయినా.. సోషల్ మీడియా ఖాతాల్లో వీరి పోస్టులు చూసిన వారు.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలారోజులుగా మాట్లాడుకుంటున్నారు.
ఇదీ చూడండి:'క్రేజీ అంకుల్స్'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి!