నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రంలో ప్రముఖ హీరోయిన్ చోటు దక్కించుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ విషయంపై వరలక్ష్మి స్పందిస్తూ.. "క్రాక్' తర్వాత నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాను' అని తెలిపారు.
వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ఫుల్ మాస్, పవర్‌ఫుల్ లుక్‌లో అలరించనున్నట్లు సమాచారం. తమన్ స్వరాలు అందించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK107 గురించి అధికారిక ప్రకటన విడుదలైంది. మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్’లో జయమ్మగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరలక్ష్మి అలరించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు.
ఇవీ చదవండి: