తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను సినీ పెద్దలు తప్పుదోవపట్టిస్తున్నారని ప్రముఖ సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో జరుపుతున్న చర్చలు విభజించు పాలించు విధానాన్ని తలపిస్తున్నాయని విమర్శించారు.
ఇటీవల చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నట్టి కుమార్.. చిన్న సినిమాల మనుగడ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సినీ పెద్దల వైఖరి స్పష్టం చేయాలని కోరిన ఆయన.. సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమైన సినీ పెద్దలు ఏం సాధించారని ప్రశ్నించారు. పెద్ద నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలకు కూడా చిరంజీవి సహకరించాలని కోరారు. దాసరి తర్వాత అంతటి స్థానంలో ఉన్న చిరంజీవి.. చిన్నవాళ్లకు అండగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: