అగ్ర కథానాయకుడు నాగార్జున కీలక పాత్రలో నటించిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. అహిషోర్ సాల్మన్ దర్శకుడు. దియా మీర్జా, సయామీఖేర్, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంది. ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నాగార్జున తన టీమ్‌తో చేసిన సాహసాలు యాక్షన్ ప్రియులను అలరించాయి.
ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగు వెర్షన్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో ఉండగా, తమిళ వెర్షన్ టాప్-5లో ఉండటం గమనార్హం. మలయాళ, కన్నడ భాషల్లోనూ ‘వైల్డ్‌డాగ్’కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్షన్ బ్రేక్ డౌన్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా తాజాగా వీడియోను విడుదల చేసింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఏవిధంగా తెరకెక్కించారన్న విషయాలను నాగార్జున, సయామీఖేర్‌లు పంచుకున్నారు.
రోహ్‌తంగ్ పాస్‌లో షూటింగ్ సందర్భంగా చేతిలో గన్ పట్టుకుని ఉండగా చలికి వణికిపోతుంటే కెమెరామెన్ ‘సర్ మీ చేతులు వణికిపోతున్నాయి. కదలకుండా ఉంచండి’ అని చెప్పేవారట. కొండపై నుంచి కిందకు జారుకుంటూ వచ్చే సన్నివేశంలో తన కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు నాగార్జున చెప్పారు. ఇలా వారు చెప్పిన ముచ్చట్లను మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">