అక్కినేని నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్న చిత్రం 'వైల్డ్ డాగ్'. నూతన దర్శకుడు అహిషర్ సోలమన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల్లో జరుగుతోంది. డేంజరస్ రొహ్తంగ్ పాస్లో చిత్రీకరణ జరుపుతున్నారు. అక్కడ 21 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని నాగ్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
-
#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020
"హాయ్. రొహ్తంగ్ పాస్ నుంచి అందరికీ శుభోదయం. సముద్ర మట్టం నుంచి 3, 980 మీటర్లు ఎత్తు(13వేల అడుగులు) లో ఉన్నాం. ఇది చాలా డేంజరస్ ప్లేస్. నవంబర్ నుంచే మే వరకు ఈ ప్రదేశాన్ని మూసేస్తారు. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. చిత్రీకరణ చాలా చాలా బాగా జరుగుతోంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ 21 రోజుల్లో పూర్తవుతుంది. తర్వాత వచ్చేస్తాను. అప్పటివరకు లవ్ యూ ఆల్."
-నాగార్జున, హీరో
ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా దర్శనమివ్వబోతున్నారు. నేరస్థులతో వ్యవహరించే అత్యంత కఠినమైన తీరుతో ఆయనను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని.. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ విడుదలై అంచనాలు పెంచింది.