ETV Bharat / sitara

Naga chaitanya web series: జర్నలిస్ట్​ పాత్రలో నాగచైతన్య! - Naga chaitanya bangarraju movie

Naga chaitanya movies: తొలిసారి ఓ వెబ్​ సిరీస్​లో నటించనున్న నాగచైతన్య.. ఇందులో సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ​ సిరీస్​కు విక్రమ్​ కె.కుమార్​ దర్శకత్వం వహిస్తున్నారు.

nagachaitnya
నాగచైతన్య
author img

By

Published : Dec 22, 2021, 2:43 PM IST

Naga chaitanya vikram kumar: ఇటీవల 'లవ్​స్టోరీ'తో హిట్​ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నాగచైతన్య గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న చైతూ.. ఇప్పుడు జర్నలిస్టు గెటప్​లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్​ నిర్మిస్తున్న ఈ వెబ్​సిరీస్​లో చైతూ ప్రధాన పోషిస్తున్నారు.

'మనం' చిత్రంతో హిట్​ కొట్టిన నాగచైతన్య-విక్రమ్​ కె. కుమార్​లు ​ ఇటీవల 'థాంక్యూ' చిత్రానికి కూడా కలిసి పనిచేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేయడంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జర్నలిస్ట్​ పాత్రలో నాగచైతన్య నటించడం ఇదే తొలిసారి.

ఈ వెబ్​సిరీస్​కు సంబంధించిన ఇతర నటీనటులు, మిగతా విషయాలను త్వరలో మేకర్స్​ వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి : 'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?.. రిలీజ్​పై టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.