కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడంటూ గత కొద్దికాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే చాలా కాలం క్రితమే మురుగదాస్ ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించాడు. అయితే ఆ సినిమా వెంటనే పట్టాలెక్కుతుందని అభిమానులు భావించారు. కానీ అది నెరవేరలేదు. ఆ విషయమై ఇటీవలే జరిగిన ఓ ఇంటర్య్యూలో మాట్లాడాడు మురుగదాస్.
"ఎన్టీఆర్‌కు చాలా కాలం క్రితం కథ వినిపించిన మాట వాస్తవమే. అయితే ఈ మధ్య కాలంలో తారక్‌ను కలవలేదు. తదుపరి సినిమా ఆయనతో చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే నేను తర్వాత ప్రాజెక్టు గురించి ఇంకా ఆలోచించలేదు. త్వరలోనే ఆ వివరాలు చెప్తా" -ఏ.ఆర్.మురుగదాస్, డైరెక్టర్
సూపర్‌స్టార్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'దర్బార్'.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్ మరో కథానాయకుడు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత చిత్రమిది. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్‌లుక్‌పై వీడని ఉత్కంఠ