వెండితెర సోగ్గాడు శోభన్‌బాబు సలహా పాటించడం వల్లే తాను ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నానని ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయన ఎంతో గొప్ప మనిషని గుర్తుచేసుకున్నారు.
శోభన్‌బాబు 85వ జయంతిని పురస్కరించుకుని వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా- ఇండియా ఆధ్వర్యంలో ఆన్లైన్లో వేడుకలను నిర్వహించారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నటి జమునతోపాటు ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, నటులు మురళీమోహన్, చంద్రమోహన్, దర్శకులు రేలంగి నర్సింహారావు, తదితరులు పాల్గొని శోభన్‌బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిపోతుంటే తనను మాత్రం శోభన్‌బాబు, మద్రాసులోనే ఉండిపొమ్మన్నారని సీనియర్ నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఆయన సలహాతో సంపాదించిన ఆస్తులే ఈరోజు తనకు అండగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఏరా అని పిలిపించుకునే ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోవడం ఎప్పటికీ లోటేనని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రమోహన్‌ను వంశీ గ్లోబల్ పురస్కారంతో సత్కరించారు.
ఇది చదవండి: శోభన్‌బాబు అందుకే నటనకు స్వస్తి చెప్పారు!