సోషల్‌మీడియాలో నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో భాగంగా ప్రముఖ ర్యాపర్ బాద్షాకు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని అతడికి చెప్పారు. కొన్ని వారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో నకిలీ, పెయిడ్ ఫాలోవర్స్‌కు సంబంధించిన విషయమై ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ రాకెట్లో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
దర్యాప్తు బృందం ఏర్పాటు
"ఈ రాకెట్‌కు సంబంధించిన దర్యాప్తులో మేము 54 సంస్థలను గుర్తించాం. సైబర్‌సెల్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్‌తో కలిపి ఓ సిట్‌ను ఏర్పాటు చేశాం. ఈ కేసు దర్యాప్తులో ఇది సహాయపడుతుంది"
-వినయ్ కుమార్ చౌబే, ముంబయి నగర జాయింట్ కమీషనర్
కొన్ని రోజుల క్రితం గాయని భూమి త్రివేది, ఆన్లైన్లో తన పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్ గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు మీద ఓ నకిలీ ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించి నెటిజన్లతో గుర్తుతెలియని వ్యక్తి చాట్ చేశాడని తెలిపింది. ఆ సందేశాల స్క్రీన్షాట్లనూ అందులో పోస్ట్ చేశారని కంప్లైంయింట్లో పేర్కొంది.
డబ్బుతో ఫాలోవర్స్
బాలీవుడ్ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా 176 మంది సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్‌ను పొందేందుకు డబ్బు చెల్లించారని ముంబయి పోలీసుల దర్యాప్తులో తేలింది.