గతంలో నిర్మాతగా పలు హిట్లు సొంతం చేసుకున్న ఎమ్మెస్ రాజు.. ఇటీవల 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో యువతను మెప్పించారు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమా '7 డేస్.. 6 నైట్స్'తో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ చిత్రం కోసం 14 ఏళ్ల సమర్త్ గొల్లపూడిని మ్యూజిక్ కంపోజర్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఈ సినిమా కోసం పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో చాలామంది వయసు 22 ఏళ్ల కంటే తక్కువే కావడం మరో విశేషం. మరి వెండితెరపై '7 డేస్.. 6 నైట్స్' ఎలాంటి ఫలితం రాబడుతుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.