>'కేజీఎఫ్ 2' నుంచి కొత్త అప్డేట్ రానుంది. ఈనెల 21న ఉదయం 10:08 గంటలకు దానిని వెల్లడించనున్నారు. శనివారం అందుకు సంబంధించిన ప్రకటన చేశారు. యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
>మాస్ మహారాజా 'క్రాక్' సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
>మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, నయనతార కలిసి నటించనున్నారు. అద్భుత దృశ్యకావ్యం 'ప్రేమమ్' తీసిన అల్ఫోన్స్ పుతరెన్ ఈ ప్రాజెక్టుకు దర్శకుడు. శనివారం ఈ విషయమై ప్రకటన చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
>'కోతి కొమ్మచ్చి' సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. వేగేశ్న సతీశ్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, సామ్ హీరోలుగా నటించారు. త్వరలో చిత్ర విడుదలపై స్పష్టత ఇవ్వనున్నారు.
>'చక్ర' సినిమా నుంచి 'హర్లా పర్లా' గీతం, 'నేడే విడుదల' నుంచి 'తానే నేను' అంటూ సాగే పాట శనివారం విడుదలయ్యాయి.
>నందమూరి తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ తదితరులు నటించిన 'ఎస్5' సినిమా టీజర్ విడుదలైంది. రైలు బోగీలో నేపథ్య కథతో దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">