ETV Bharat / sitara

ఇకపై థియేటర్లలో పక్కపక్కన కూర్చోవడం కష్టమే! - టాలీవుడ్ తాజా వార్తలు

భాగ్యనగరంలోని థియేటర్లలో పలు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు యజమానులు. సీటు విడిచి సీటులో కూర్చొనే విధానాన్ని రూపొందిస్తున్నారు. ప్రతి ఆట పూర్తయిన తర్వాత సీట్లను శానిటైజ్ చేయాలని భావిస్తున్నారు.

ఇకపై థియేటర్లలో పక్కపక్కన కూర్చోవడం కష్టమే
సినిమా థియేటర్
author img

By

Published : May 10, 2020, 9:27 AM IST

హైదరాబాద్‌ మహానగరంలో సినిమా థియేటర్ల తీరు మారబోతోంది. కరోనా వ్యాప్తి చెందకుండా థియేటర్లలో అనేక చర్యలు తీసుకునేందుకు యజమానులు సిద్ధమయ్యారు. తిరిగి సినిమా ప్రదర్శనలు మొదలైతే థియేటర్‌లో ఓ సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని రూపొందిస్తున్నారు. రెండురోజుల్లో నగరంలోని ఓ ప్రముఖ థియేటర్లో ఈ విధానాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు. ఈ వైరస్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జంటనగరాల్లోని దాదాపు వందమంది థియేటర్‌ యజమానులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా తమ సమస్యలపై చర్చించుకున్నారు. ప్రభుత్వం ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడానికి ముందే థియేటర్లలో వైరస్‌ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వ పెద్దలను కలిసి నివేదికను అందజేయాలని నిర్ణయించుకున్నారు.

movie theatres after coronavirus epidemic
థియేటర్లలో కొత్తగా కూర్చునే విధానం

ఇవీ చేయబోయే మార్పులు

  • ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకున్నప్పుడే ఓ సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండకుండా సాంకేతిక మార్పులు చేయబోతున్నారు. ఒకటో నంబరు సీటు బుక్‌ చేసుకుంటే రెండో నంబరు ఆన్‌లైన్‌లో కనిపించదు. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకేచోట సీట్లు కావాలంటే కేటాయించే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు.
  • ప్రతి ఆట ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్‌ చేసి ఎర్ర రిబ్బన్‌ పెడతారు. సాధారణంగా ఓ ఆట పూర్తయిన పది నిమిషాల్లోనే మరో షో మొదలవుతోంది. ఇకముందు 45 నిమిషాల తర్వాతే మొదలుపెడతారు. దీన్నిబట్టి రోజుకు నాలుగు ఆటలకు బదులు మూడే ప్రదర్శించే అవకాశం ఉంటుందని థియేటర్‌ యజమాని ఒకరు తెలిపారు.
  • కాగితం రూపంలో టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇక క్యూఆర్‌కోడ్‌తో టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. దీన్ని స్కాన్‌ చేసి హాలు లోపలికి పంపిస్తారు.
  • తినుబండారాల స్టాల్స్‌ వద్ద, మరుగుదొడ్ల దగ్గర, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవరణలో ఎక్కడా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు.
  • ఇవే కాకుండా ప్రభుత్వం సూచించే అన్ని నిబంధనల అమలుకు కార్యాచరణ రూపొందిస్తారు.

ప్రేక్షకులకు భరోసా కల్పించడానికే

కరోనా వల్ల సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సినిమాలకు వెళ్తే అక్కడంతా సురక్షితమే అన్న భరోసాను ప్రేక్షకులకు కల్పించాల్సి ఉంది. అందుకే జంటనగరాల్లోని అన్ని థియేటర్ల యజమానులం చర్చించుకున్నాం. ముందస్తుగా థియేటర్లను సిద్ధం చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటిస్తాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న థియేటర్ల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి. -బాలగోవింద్‌ రాజ్‌, సుదర్శన్‌ థియేటర్‌ యజమాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.