అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు.. పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిధ్ధిఖీ. ఈ హీరో నటిస్తున్న సినిమా 'మోతీచూర్ ఛక్నాచూర్'. అతియా శెట్టి హీరోయిన్. దేబ్మిత్రా బిస్వాల్ దర్శకుడు. ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. జీవిత భాగస్వామి కోసం ఆరాటంగా ఎదురుచూస్తోన్న ఇద్దరి వ్యక్తుల కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
'36 ఏళ్లు.. ఇంకా ఎన్నేళ్లు బ్రహ్మచారిగా ఉండాలి. నా కోసం ఓ అమ్మాయిని చూడు.. తను లావుగా, చూసేందుకు ఎంత అసహ్యంగా ఉన్నా పర్వాలేదు. నేను పెళ్లి చేసుకుంటా.. నాకు అమ్మాయి కావాలంతే..' అని నవాజుద్దీన్ చెబుతున్న డైలాగ్ సినిమాపై ఆసక్తి రేపుతోంది.
ఈ సినిమాలో విదేశాలకు వెళ్లాలని కలలు కనే అమ్మాయిగా అతియా నటించింది. నవాజ్, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని అపార్థం చేసుకుని, వయసు ఎక్కువైనా సరే అతడిని పెళ్లి చేసుకుంటుంది. నిజం తెలుసుకొని షాక్ అవుతుంది హీరోయిన్. హాస్యభరితంగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఆ స్టార్ హీరో సీక్రెట్ బయటపెట్టిన సన్నీలియోనీ