ETV Bharat / sitara

వారి కోసం మళ్లీ కలుస్తున్న మమ్ముట్టి, మోహన్​లాల్ - కరోనా బాధితుల కోసం మమ్ముట్టి, మోహన్​లాల్​ సినిమా

మలయాళ సూపర్​స్టార్స్​ మమ్ముట్టి, మోహన్​లాల్​ కలిసి ఓ మల్టీ స్టారర్​ చిత్రం చేయనున్నారు. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చిన వసూళ్లనూ కరోనా వల్ల ఇబ్బంది పడుతోన్న బాధితుల కోసం ఉపయోగించనున్నారు.

mohan
మోహన్​
author img

By

Published : Feb 7, 2021, 11:01 PM IST

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు మలయాళ సూపర్ స్టార్స్​ మోహన్​లాల్​, మమ్ముట్టి. వీరిద్దరు కలిసి ఓ మెగా మల్టీస్టారర్‌ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించడమే కాకుండా వచ్చే మొత్తాన్ని కొవిడ్​ వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానో ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నారు.

అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌(అమ్మ) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని 'అమ్మ' అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ ప్రకటించారు. ప్రముఖ మలయాళ డైరెక్టర్లు ప్రియదర్శన్, టీకే రాజీవ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్​లాల్​ కలిసి ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. ఈ చిత్రంలో వీరితో పాటు సుమారు 140 మంది ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇదీ చూడండి: సినిమాల్లో 'రాజకీయం'.. చిరుతో పాటు ఆ హీరోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.