ETV Bharat / sitara

రజనీ నిర్ణయాన్ని స్వాగతించిన మోహన్​బాబు - రజనీకాంత్ మోహన్​బాబు

సూపర్​స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా దీనిపై స్పందించిన విలక్షణ నటుడు మోహన్​బాబు రజనీ నిర్ణయాన్ని స్వాగతించారు.

Mohanbabu welcomes Rajinikant decision on polotical entry
రజనీ నిర్ణయాన్ని స్వాగతించిన మోహన్​బాబు
author img

By

Published : Dec 31, 2020, 4:18 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఎంతోకాలంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశచెందారు. కొందరు రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తే మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్​బాబు రజనీ నిర్ణయంపై స్పందించారు.

Mohanbabu welcomes Rajinikant decision on polotical entry
మోహన్​బాబు ప్రకటన

"రజనీకాంత్​ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్​లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులకు బాధ కలిగించినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నా" అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సందేశం పోస్ట్ చేశారు మోహన్​బాబు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.