మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర టీజర్‌ను గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్.. సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ విడుదలై ఆసక్తి పెంచుతుంది. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: పరువునష్టం కేసులో కంగనకు సమన్లు