లాక్డౌన్ నేపథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ).. మంగళవారం ఒక్కరోజు 1000 మంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించింది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఛారిటీ సభ్యులపై ప్రశంసలు కురిపించారు.
"ఒకే రోజు 1000 మందికి సరుకులు పంపిణీ చేశాం అంటే ఆశ్చర్యపోయాను. ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకొచ్చి ఇదొక బాధ్యతగా భావించి ఈ పనిచేశారంటే పరిశ్రమలోని సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. డబ్బు ఉన్నా సేవచేసే వాళ్లు కావాలి. అందరూ అభినందిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ పంపిణీ విధానం తెలుసుకుని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు" -మెగాస్టార్ చిరంజీవి, కథానాయకుడు