ETV Bharat / sitara

చిరు 152: రామోజీ ఫిలింసిటీలో మెగాస్టార్​ పోరాటాలు

మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఇక్కడ మెగాస్టార్​పై భారీ స్థాయిలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించారు.

Chiru 152
రామోజీ ఫిలింసిటీలో చిరు పోరాటం
author img

By

Published : Feb 29, 2020, 8:29 AM IST

Updated : Mar 2, 2020, 10:32 PM IST

చిరంజీవిని మాస్‌ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది డ్యాన్సులు, ఫైట్‌లే. అందుకే అతని సినిమాల్లో పోరాటాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు దర్శకులు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రంలోనూ.. ఫైట్స్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ ఫైట్‌ని చిరంజీవి, కన్నడ కిషోర్‌ తదితరులపై రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్‌ నేతృత్వంలో తీర్చిదిద్దారు.

కీలక పాత్రలో సోనూ

ఈ 'మెగా' చిత్రంలోని ఓ కీలక పాత్రలో సోనూసూద్‌ నటిస్తున్నాడు. ఇప్పటికే చిరు, సోనూల మధ్య కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్రిష కథానాయిక. మణిశర్మ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

వి.వి.వినాయక్‌కి రీమేక్‌ బాధ్యతలు?

చిరంజీవి కోసం మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌ హక్కుల్ని కొనుగోలు చేశాడు రామ్‌చరణ్‌. మాతృకలో అగ్ర నటులు మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించే బాధ్యతల్ని చిరంజీవి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌కి అప్పజెప్పినట్టు సమాచారం. చిరంజీవితో ఇదివరకు 'ఠాగూర్‌', 'ఖైదీ నంబర్‌ 150' చిత్రాల్ని తెరకెక్కించి విజయాల్ని అందుకున్నాడు వినాయక్‌. ఈ రెండూ రీమేక్‌లే కావడం విశేషం. మరోసారి అతడికే ఈ రీమేక్‌ బాధ్యతల్ని అప్పజెప్పాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఇదీ చూడండి...

చిరు-కొరటాల చిత్రం నుంచి మెగాస్టార్ లుక్ లీక్

Last Updated : Mar 2, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.