ETV Bharat / sitara

చిరంజీవి 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ - చిరంజీవి రామ్​చరణ్ ఆచార్య మూవీ

Acharya new release date: చిరు 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు.

CHIRANJEEVI ACHARYA
చిరంజీవి 'ఆచార్య'
author img

By

Published : Jan 16, 2022, 10:32 AM IST

Chiranjeevi acharya movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల నిర్మాణ సంస్థలు ట్వీట్ చేసింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించి, ఫ్యాన్స్​లో జోష్ నింపింది.

CHIRANJEEVI ACHARYA
చిరంజీవి 'ఆచార్య' కొత్త రిలీజ్ డేట్

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది. రామ్​చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

అయితే ఏప్రిల్ 1నే తమ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' టీమ్ ఇప్పటికే ప్రకటించింది. మరి వీళ్లు వాయిదా వేస్తారా లేదా అనేది చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.