ETV Bharat / sitara

ఇంటివద్దే కంగనకు కరోనా టెస్టు

ముంబయి ప్రయాణానికి ముందు బాలీవుడ్​ నటి కంగన రనౌత్​కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందం ఆమె నివాసానికి వచ్చి టెస్టులు చేసింది.

Kangana
కంగన
author img

By

Published : Sep 7, 2020, 8:41 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో తన ఇంటివద్ద ఉంది. కానీ ఈ మధ్య ముంబయి వివాదంలో కంగన విమర్శలు ఎదుర్కొంటోంది. శివసేన నేతలు, కంగన మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ముంబయి వెళ్లనుంది. ఈ క్రమంలోనే సిమ్లాలోని ఆమె నివాసానికి వైద్య బృందం వచ్చి కరోనా టెస్టు చేసింది.

కంగనతో సహా ఆమె సోదరి రంగోలి రక్తనమూనాలను తీసుకున్నామని.. రేపటిలోగా ఫలితాలు వస్తాయని వైద్యులు తెలిపారు. కాగా శివసేన నేత సంజయ్​ రౌత్​, కంగన మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో.. కంగనకు హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది.

ఇటీవలే బాలీవుడ్​ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే తాను ఎక్కువగా భయపడుతున్నట్లు కంగన చెప్పింది. దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్​.. ఆమెను ముంబయికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు. దీనిపై స్పందిస్తూ ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ.. కంగన ట్వీట్​ చేసింది. దీంతో సెప్టెంబరు 9న ముంబయిలో అడుగుపెడతానని.. వీలైతే ఆపుకోమని కంగన సవాలు విసిరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.