ETV Bharat / sitara

పదిహేడేళ్ల తర్వాత ఆనాటి ముద్దుగుమ్మ రీఎంట్రీ

author img

By

Published : Feb 8, 2021, 5:33 AM IST

సీనియర్​ నటి అన్షూ అంబానీ.. త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

anshu
అన్షూ

'గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది' అంటూ నాగార్జునతో కలిసి ఆడిపాడి.. ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అన్షూ అంబానీ. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్‌ సరసన 'రాఘవేంద్ర'లో నటించారు. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మరే ఇతర చిత్రంలోనూ పూర్తిస్థాయి పాత్రలో కనిపించలేదు. 2004లో విడుదలైన 'మిస్సమ్మ'లో అన్షూ ఓ గెస్ట్‌ రోల్‌లో సందడి చేశారు.

కాగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ అంబానీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో అన్షూ కీలక పాత్రను పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్​30గా పట్టాలెక్కనున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ రెండో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రియా చక్రవర్తికి టాలీవుడ్​ నుంచి ఆఫర్లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.